Amos 2:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమి్మ వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమి్మ వేయుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు.