Amos 5:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోర మైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.