Daniel 10:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పు డతడుదానియేలూ, భయ పడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను.