Daniel 11:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరి గించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కిత్తీము నుండి ఓడలువచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం చూసి, అతడు భయభ్రాంతుడవుతాడు. అప్పుడతను వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడంబడికను విసర్జించేవాళ్ల మాట వింటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు.