Daniel 2:41 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ, బంకమట్టి కలిసినట్టుగా చూశావు గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ విగ్రహ పాదాలు, కాళ్ల వేర్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్టు మీరు చూసిన విధంగా అది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది; అయినా ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లు, దానిలో కొంత ఇనుములా బలంగా ఉంటుంది.