Daniel 4:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈ ఆజ్ఞ జాగరూకు లగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛ éయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నా డనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’