Daniel 7:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవతరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణచివేస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను–ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అతడు ఇలా వివరించాడు: ‘నాలుగవ మృగం భూలోకంలోని నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యాలకు భిన్నంగా ఉంటూ, సర్వ లోకాన్ని త్రొక్కుతూ, నాశనం చేస్తూ మ్రింగివేస్తుంది.