Deuteronomy 1:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మనమెక్కడికి వెళ్లగలము? మన సహో దరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయు లను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని మేము చూశాము’ అని వారు చెప్పారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు–అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనం ఎక్కడికి వెళ్లగలం? మన సహోదరులు, ‘అక్కడి ప్రజలు మనకన్నా బలవంతులు, పొడవైనవారు; ఆ పట్టణాలు ఎంతో పెద్దవిగా ఆకాశమంత ఎత్తైన గోడలతో ఉన్నాయి; అక్కడ అనాకీయులను కూడా చూశాం’ అని చెప్పి మా గుండెలు భయంతో చెదిరిపోయేలా చేశారు” అన్నారు.