Deuteronomy 1:41 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు మీరుమేము యెహో వాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తర మిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అప్పుడు మీరు, ‘మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు యెహావా దేవుడు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం యిప్పుడు మేము వెళ్లి పోరాడుతాము’ అని అన్నారు. “అప్పుడు మీరు ఒక్కొక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం అని మీరు అనుకొన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు మీరు–మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మీరు, “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాము. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్లి పోరాడతాం” అని నాతో చెప్పి మీ ఆయుధాలను ధరించి కొండసీమ మీదికి వెళ్లడం సులభమనుకుని మీలో ప్రతి ఒక్కరు సిద్ధపడ్డారు.