Deuteronomy 12:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవు డైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను మీకాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.