Deuteronomy 12:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రు లేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలదియిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు.