Deuteronomy 12:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతములమీదనేమి మెట్టలమీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్క డెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు స్వాధీనం చేసుకోబోయే దేశాల్లో ఎక్కడైతే ప్రజలు తమ దేవుళ్ళను సేవిస్తారో, అనగా ఎత్తైన పర్వతాలమీద కొండల పైన విస్తరించి ఉన్న చెట్టు క్రింద ఉన్న ఆ స్థలాలన్నిటిని పూర్తిగా నాశనం చేయాలి.