Deuteronomy 13:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని, మీరు అతణ్ణి చంపాల్సిందే. మీరు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. నీవే మొట్టమొదట రాళ్లు తీసుకొని అతని మీద విసరాలి. తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయత్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యెహోవాయే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి.