Deuteronomy 14:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎద్దులకేమి గొఱ్ఱల కేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీకు యిష్టం వచ్చింది ఏదైనా– ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.