Deuteronomy 15:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు కదురును పట్టుకొని, తలుపు లోనికి దిగునట్లుగా వాని చెవికి దానినిగుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై యుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ సేవకుడు మీ తలుపుకు అతని చెవి ఆనించునట్లు ఉంచి, ఒక పనిముట్టును ఉపయోగించి అతని చెవిమీద రంధ్రం చేయాలి. అప్పుడు అతడు శాశ్వతంగా మీకు బానిస అవుతాడు. మీ దగ్గరే ఉండిపోవాలి అనుకొనే బానిస స్త్రీలకు కూడ యిలాగే చేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.