Deuteronomy 15:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొన కూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీత ముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీరు మీ బానిసలను స్వేచ్ఛగా వెళ్లిపోనిచ్చినప్పుడు అది చెడ్ఢ పని అని మీరు తలంచకూడదు. ఒక జీతగానికి నీవు చెల్లించేదానిలో సగం డబ్బుకే అతడు ఆరు సంవత్సరాలు నీ దగ్గర పనిచేసాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే ప్రతిదానిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగావాడు ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ దాసులను స్వేచ్ఛగా పోనివ్వడానికి మీరు కష్టం భావించవద్దు, ఎందుకంటే ఆరు సంవత్సరాలు వారు మీకు చేసిన సేవ మామూలు కూలివారు చేసే దానికన్నా రెట్టింపు ఉంటుంది. మీరు అలా చేస్తే మీ దేవుడైన యెహోవా మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని దీవిస్తారు.