Deuteronomy 19:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఒకరితో ఒకరు వాదించుకొంటున్న ఆ ఇద్దరు వ్యక్తులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.