Deuteronomy 19:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విసరిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలివాడు చనిపోయినయెడల,వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.