Deuteronomy 2:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హోరీ ప్రజలు కూడ ఇంతకు ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీయులు అంతకు ముందు నివసించిన చోట ఏశావు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీయులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గతంలో హోరీయులు శేయీరులో నివసించేవారు, అయితే ఏశావు సంతతివారు, ఇశ్రాయేలీయులు యెహోవా తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో చేసినట్లుగా, వారిని తరిమివేశారు. వారు హోరీయులను తమ ఎదుట నుండి నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.