Deuteronomy 20:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఈ జనముల పురములు గాక నీకు బహు దూర ముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[15-18] ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమతమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీకు దూరంగా ఉన్న సమీపంలోని దేశాలకు చెందని అన్ని పట్టణాల పట్ల మీరు ఈ విధంగా వ్యవహరిస్తారు.