Deuteronomy 20:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టు కొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశిం చును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు.