Deuteronomy 22:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమెను తన తండ్రి ఇంటి తలుపు దగ్గరకు తీసుకురావాలి; అక్కడ ఆ పట్టణ పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వేశ్యావృత్తి చేయడం ద్వారా ఆమె ఇశ్రాయేలులో తప్పుడు పని చేసింది. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.