Deuteronomy 24:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోప కూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఒక పురుషునికి పెళ్లయిన కొత్తలోనే అతణ్ణి సైన్యంలోనికి పంపకూడదు. అతనికి ఎలాంటి ప్రత్యేక పనినీ విధించకూడదు. ఒక్క సంవత్సరం అతడు ఇంటి దగ్గరే ఉండి, తన కొత్త భార్యను సంతోషపెట్టేందుకు అతడు స్వేచ్చగా ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.