Deuteronomy 25:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి— నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి.