Deuteronomy 26:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధినినీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయుల కును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలి: ‘నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం) నేను నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. నేను వాటిని మరచిపోలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని–నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్ఠితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇలా చెప్పాలి: “మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రతిష్ఠితమైన దాన్ని నా ఇంటి నుండి తీసివేసి లేవీయులకు విదేశీయులకు, తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇచ్చాను. నేను మీ ఆజ్ఞలను ప్రక్కన పెట్టలేదు వాటిలో దేన్ని నేను మరచిపోలేదు.