Deuteronomy 26:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులనుపాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమా ణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పరలోకంలోని నీ పవిత్ర నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను–పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ పవిత్ర నివాసమైన ఆకాశం నుండి క్రిందికి చూడండి మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను, మీరు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని ఆశీర్వదించండి.”