Deuteronomy 3:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యొర్దాను నది దాటి వెళ్లజాలవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు ఈ యొర్దానును దాటకూడదుగాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు.