Deuteronomy 31:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషు వకు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత నూను కుమారుడైన యెహోషువతో యెహోవా మాట్లాడాడు: ఆతనితో, “దైర్యంగా, నిబ్బరంగా ఉండు. నేను ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలోకి నీవు ఆ ప్రజలను నడిపిస్తావు. నేను నీతో ఉంటాను” అని యెహోవా చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”