Deuteronomy 31:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞా పించిన మార్గమును తప్పుదు రనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగు ననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా మరణం తర్వాత మీరు చెడ్డ వాళ్లవుతారని నాకు తెలసు, మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా చెబుతాడో అవే మీరు చేయాలనుకుంటారు గనుక. మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరుచేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”