Deuteronomy 32:43 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి. ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక. ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతి దండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జనులారా, ఆయన ప్రజలతో కూడా సంతోషించండి, ఎందుకంటే ఆయన తన సేవకుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటారు; ఆయన తన శత్రువుల మీద పగతీర్చుకుంటారు తన దేశం కోసం తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు.