Deuteronomy 33:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో, మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో, తన సోదరులనుంచి వేరుగావించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.