Deuteronomy 33:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు కాపలా ఉండేవాడు. నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు. వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవినిగూర్చి యిట్లనెను— నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.