Deuteronomy 4:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహ త్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?