Deuteronomy 5:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్య మును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వర మును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు నాతో అన్నారు, “మన దేవుడైన యెహోవా తన మహిమను తన ఘనతను మాకు చూపించారు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాము. దేవుడు మనుష్యులతో మాట్లాడినా వారు బ్రతికే ఉంటారని ఈ రోజు మేము చూశాము.