Deuteronomy 5:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినయెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.”