Deuteronomy 5:33 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞా పించినట్లు చేయుటకు జాగ్రత్తపడవ లెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి మీరు కుడికేగాని యెడమకేగాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.