Ecclesiastes 11:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
చూలాలి గర్బ éమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చూలాలి గర్భమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, అన్నిటిని చేసినవాడైన దేవుని క్రియలు మీకు అర్థం కావు.