Ecclesiastes 9:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలూ, మూర్ఖపు ఆలోచనలూ చేస్తూ వుంటారు, ఇది చాలా చెడ్డది. ఆ ఆలోచనలు మరణానికి దారితీస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు.