Esther 5:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నం దున మొర్దెకైమీద బహుగా కోపగించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్కరించక పోయేసరికి హామానుకు తల కొట్టేసినట్లయింది. అతని కోపం మిన్నుముట్టింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకైమీద బహుగా కోపగించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది.