Esther 7:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడుఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజుదానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.” “హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు ముందరనుండు షండులలో హర్బోనా అనునొకడు–ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజు–దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు. వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు.