Esther 9:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును,నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బాటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని నీవు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తాను. నీవు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు రాణియైన ఎస్తేరుతో–యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.