Exodus 12:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీ యులలోనుండి కొట్టివేయబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్లలోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినమువరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి.