Exodus 17:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మోషేతో వాదించుచుత్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషేమీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక ప్రజలు మోషే మీదికి లేచి, అతనితో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్ము” అని ప్రజలు మోషేను అడిగారు. అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషేతో వాదిం చుచు–త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే— మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వారు మోషేతో గొడవపడుతూ, “మాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వు” అని అడిగారు. అందుకు మోషే, “నాతో ఎందుకు గొడవపడుతున్నారు? యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” అన్నాడు.