Exodus 17:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక, “కొందరు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకొని రేపు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేమో కొండ శిఖరం మీద నిన్ను గమనిస్తూంటాను. దేవుడు నాకు ఇచ్చిన కర్రను నేను పట్టుకొని ఉంటాను,” అని యెహోషువతో మోషే చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మోషే యెహోషువతో, “మన పురుషులలో కొందరిని ఎంపిక చేసుకుని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లు. రేపు దేవుని కర్ర నా చేతులతో పట్టుకుని కొండ శిఖరం మీద నిలబడతాను” అని చెప్పాడు.