Exodus 19:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మోషే యెహోవాతోప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవుపర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే యెహోవాతో— ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు–పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మోషే యెహోవాతో, “ప్రజలు సీనాయి పర్వతం ఎక్కి రాలేరు, ఎందుకంటే ‘పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పరచి దానిని పరిశుద్ధంగా ఉంచాలి’ అని మీరే మాకు ఆజ్ఞాపించారు” అన్నాడు.