Exodus 21:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణ యించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితేవాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడలవాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయినప్పటికీ, ఒకవేళ అది ఉద్దేశపూర్వకంగా కాక, దేవుడు దానిని జరగనిస్తే, వారు నేను నియమించే స్థలానికి పారిపోవాలి.