Exodus 21:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారములేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కావాలని ఆమెను ఎన్నుకున్న యజమానిని ఆమె సంతోషపెట్టలేకపోతే, అతడు ఆమెను విడిపించబడనివ్వాలి. అతడు ఆమెను విదేశీయులకు అమ్మడానికి అతనికి అధికారం లేదు, ఎందుకంటే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడు.