Exodus 22:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱనైనను దొంగిలించి దాని అమి్మనను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱకు ప్రతిగా నాలుగు గొఱ్ఱలను ఇయ్య వలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్యవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఎవరైనా ఎద్దునైన గొర్రెనైన దొంగతనం చేసి దానిని చంపినా లేదా అమ్మినా ఆ ఎద్దుకు బదులు అయిదు ఎద్దులను, ఆ గొర్రెకు బదులు నాలుగు గొర్రెలను నష్టపరిహారంగా ఇవ్వాలి.