Exodus 22:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాడికి స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే, దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజమానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు, గాడిద, గొర్రె, ఏదైనా ఫర్వాలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దొంగ కన్నము వేయుచుండగావాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“రాత్రివేళ దొంగ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఒకవేళ దొరికిపోయి చావుదెబ్బలు తింటే కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి కాడు.