Exodus 28:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నిర్ణయాలు తీసుకోవటానికి హస్త నైపుణ్యంతో కూడిన రొమ్ము పతకం చేయాలి. ఏఫోదును చేసినట్లు దీనిని బంగారం నీలం ఊదా ఎరుపురంగు నూలు పేనిన సన్నని నారతో తయారుచేయాలి.